శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 3,77,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 2,08,452 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 4,04,377 క్యూసెక్కులు ఉంది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 213.4011 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 26,727 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.