ETV Bharat / city

'ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా.. అల్లర్ల హైదరాబాద్‌ కావాలా..?' - kcr on ghmc elections

KCR
ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా.. అల్లర్ల హైదరాబాద్‌ కావాలా..?: కేసీఆర్
author img

By

Published : Nov 18, 2020, 7:27 PM IST

Updated : Nov 18, 2020, 8:50 PM IST

19:25 November 18

'ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా.. అల్లర్ల హైదరాబాద్‌ కావాలా..?'

హైదరాబాద్​లో అభివృద్ధి కావాలా.. అశాంతి రాజ్యమేలాలో ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్​ కోరారు. ప్రశాంత మతసామరస్యం కావాలా.. మతం పేరిట పొడుచుకునే నగరం కావాలా ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి తీరుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని దాన్ని తిప్పికొట్టాలని తెరాస శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదలతో ఇబ్బందిపడిన హైదరాబాద్​కు కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయలేదని.. రాష్ట్రప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు.  

వంద స్థానాలు పక్కా..

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసకు వంద సీట్లు దక్కితీరుతాయని.. అన్ని సర్వేలు తెరాస విజయాన్నే సూచిస్తున్నాయని తెరాస పార్లమెంటరీ, శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ ఉద్ఘాటించారు. తెరాసకు పోరాటం కొత్త కాదన్న కేసీఆర్... పార్టీ పనైపోయిందని ఒక దశలో ప్రచారం చేశారని.. అలాంటి సమయంలో తెరాస లేచి దెబ్బకొట్టిందన్నారు. తెరాస దేశంలోనే ఒక రాజకీయ ప్రబల శక్తి అని.. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ప్రతీసారి ప్రజలు ఆశీర్వాదంతో గొప్ప విజయాలు సాధించామని కేసీఆర్ అన్నారు.  

భాజపా, కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలి..

హైదరాబాద్​లో ఆరేళ్లలో 67 వేల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని.. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనేక కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు నిర్మించినట్లు సీఎం కేసీఆర్ వివరించారు. పేదల కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించామని.. జీవో నంబర్ 58 ద్వారా పేదల ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించామన్నారు. రోజూ 50వేల మందికి 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని వివరించారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని.. మాయ మాటలకు, తప్పుడు ప్రచారానికి హైదరాబాద్ నగర ప్రజలు పడిపోయే వాళ్లు కాదని. తప్పకుండా నిజాలు గ్రహిస్తారని కేసీఆర్ అన్నారు. తప్పుడు ప్రచారాలతో అబద్ధాలను నిజాలుగా భ్రమింప చేయాలని భాజపా చేస్తున్న ప్రయత్నాలను తెరాస శ్రేణులు తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశానికి మంచి దిశానిర్దేశం..  మంచి నాయకత్వం కావాలని.. భాజపా, కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలని కేసీఆర్ పేర్కొన్నారు.  

మతకల్లోలాలపై..

మతసామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్​లో.. అన్ని మతాలు, ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నారని కేసీఆర్ అన్నారు. కొందరు చేతగాని నేతల వల్ల హైదరాబాద్​లో కొన్నిసార్లు మత కల్లోలాలు వచ్చాయని వ్యాఖ్యానించిన కేసీఆర్.. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరున్నరేళ్లలోనే హైదరాబాద్ ప్రశాంత నగరంగా మారిందన్నారు. ఫలితంగా నగరానికి పెట్టబడులు తరలివస్తున్నాయని వివరించారు. ఆరేళ్లలో హైదరాబాద్​కు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని.. ఒక్క అమెజాన్ కంపెనీనే 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజలు గమనించారని కేసీఆర్ అన్నారు.  

పండుగ పూట పేదలు పస్తులుండవద్దనే..  

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న హైదరాబాద్ కోసం, ఇబ్బంది పడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు కాని బురద రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. వరదల్లో పేదవాళ్లే ఎక్కువ నష్టపోయారని.. వారి కష్టం చూసి చలించిపోయానన్నారు. దసరా, దీపావళి పండుగల ముందు విపత్తు వచ్చిందని.. పండుగ పూట పేదలు పస్తులుండవద్దనే ఉద్దేశంతోనే ఎవరూ అడగకుండానే ఇంటికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. వరద బాధితుల సాయం కోసం 550 కోట్ల రూపాయలు విడుదల చేశామని.. 50 కోట్ల రూపాయలతో సహాయ, పునరావాస కార్యక్రమాలు, 500 కోట్లతో ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇప్పటికే 6 లక్షల 78 వేల మందికి సాయం అందిందని.. బాధితులు అందరికీ సాయం అందిస్తామని స్పష్టం చేశారు.  

పేదల నోటికాడి బుక్క లాక్కుంటున్నారు!

రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా.. హైదరాబాద్ నగరాన్ని, ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం మండిపడ్డారు. సహాయం చేయకపోగా, ఇచ్చే సాయాన్ని అడ్డుకుందని ఆరోపించారు. నగరంలో పేదలకు ఆర్థిక సాయం నిలిపి వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని.. పేదల నోటికాడి బుక్క లాక్కుంటున్న రాజకీయాలను ప్రజలు గమనించాలని కేసీఆర్ కోరారు. దుబ్బాక ఎన్నికల్లో భాజపా చేయని దుష్ప్రచారం.. ఆడని అబద్ధం లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తెరాస అభ్యర్థిని అవమానించారని.. బ్యాలట్ పత్రంపై హరీష్ రావు ఫోటో లేదని ఆమె అడిగినట్లు అబద్ధపు ప్రచారం చేశారన్నాని.. ఇంతకన్నా దుర్మార్గం, పాపం ఉంటుందా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రచారం చేస్తారని.. ప్రజలు, తెరాస కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్రానికి తెరాస శ్రీరామరక్ష..

దేశానికే ఆదర్శంగా నిలిచే గొప్ప అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. దేశమంతా అబ్బురపడే విధంగా మిషన్ భగీరథ పథకం తెచ్చామని... విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అన్నివర్గాలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రశ్రేణిలో ఉందన్నారు. ఆర్టీసీలో 50 శాతం ప్రైవేటు పెట్టుబడులను అనుమతించాలని కేంద్రం చెప్పినా వినకుండా.. ఆర్టీసీని కాపాడుకున్నామన్నారు. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటున్నామని. రైతులు, పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా లేనన్ని పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు వివరించారు. ప్రజలే కేంద్రంగా ఇక్కడ పాలన సాగుతోందని.. రాష్ట్రానికి తెరాస శ్రీరామరక్షగా నిలుస్తున్నదన్నారు. కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడే విధంగా తెరాస క్రియాశీలపాత్ర పోషించనున్నదన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని కేసీఆర్ అన్నారు. ఇటీవల మరణించిన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం నివాళులు అర్పించారు.  

ఇవీచూడండి: 'కేంద్రంపై దేశవ్యాప్త పోరు.. డిసెంబర్​లో జాతీయ స్థాయి సమావేశం'

Last Updated : Nov 18, 2020, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.