ETV Bharat / city

జడ్జి రామకృష్ణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

జడ్జి రామకృష్ణ పిటిషన్‌పై ఏపీ ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. రామకృష్ణ ఇచ్చిన పెన్‌డ్రైవ్‌లోని సంభాషణను నిజనిర్ధరణ చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

vja-hc-on-judge-rk-with-rtd-supre-judge-breaking
జడ్జి రామకృష్ణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
author img

By

Published : Aug 13, 2020, 5:38 PM IST

జడ్జి రామకృష్ణ వేసిన అనుబంధ పిటిషన్​పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనానికి సమర్పించిన పెన్ డ్రైవ్​లో సంభాషణపై నిజనిర్ధరణ చేయాలని నిర్ణయించింది. విచారణ అధికారిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్​వీ రవీంద్రన్​ను నియమించింది. దర్యాప్తులో భాగంగా విచారణ అధికారికి అవరమైతే సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు సహకరించాలని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టు ప్రాంగణాన్ని కరోనా రెడ్ జోన్​గా ప్రకటించాలని పేర్కొంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన పిల్​పై విచారణను పునఃప్రారంభించాలని కోరుతూ జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్​ను గత విచారణలో అనుమతించింది. పిల్​లో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్​లో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చింది.

హైకోర్టు, న్యాయమూర్తులపై జస్టిస్‌ ఈశ్వరయ్య ఆరోపణలు చేశారని జడ్జి రామకృష్ణ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆడియో తన వద్ద ఉందని చెబుతూ ఆధారాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం పెన్‌ డ్రైవ్‌లో ఉన్నసంభాషణపై నిజనిర్ధరణ చేయాలని ఆదేశిస్తూ విచారణ అధికారిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్​వీ రవీంద్రన్​ను నియమించింది

ఇదీ చూడండి. బాలుడిని చితకబాదిన బంధువు... వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.