ETV Bharat / city

నెహ్రూ జూపార్కులోకి భారీగా వరద నీరు.. సందర్శనలు నిలిపివేత..

Floods in Zoo Park: కుండపోతగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్​లో జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెహ్రూ జూపార్కులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా జూపార్కును అధికారులు మూసేశారు.

Visits Stopped due to Heavy flood water in Nehru Zoo Park

author img

By

Published : Jul 13, 2022, 4:33 PM IST

నెహ్రూ జూపార్కులోకి భారీగా వరద నీరు.. సందర్శనలు నిలిపివేత..

Floods in Zoo Park: భారీ వర్షాలకు హైదరాబాద్‌ బహదూర్​పురా నెహ్రూ జూపార్కులో భారీగా వరదనీరు చేరింది. పెద్దఎత్తున వరద నీరు చేరటంతో.. సఫారీ పార్కును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. జంతువులన్ని ఎన్​క్లోజర్‌లో సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

జూపార్కుకు అనుకుని మీర్​ అలం చెరువు ఉండడం వల్ల.. దాని ఔట్ ఫ్లో ఒకటి సఫారీ పార్క్ గుండా మూసిలోకీ వెళ్తుంది. ఒకపక్క వరద నీరు.. మరోపక్క మీర్ అలం చెరువు ఔట్ ఫ్లో నీరు ఒక్కసారిగా రావడంతో సఫారీ పార్కులో భారీగా నీళ్లు చేరినట్లు అధికారులు తెలిపారు. సపారీకి వేళ్లే దారులలో ప్రమాదకర స్థాయిలో నీరు చేరడంతో పార్కును మూసివేసినట్లు పేర్కొన్నారు. నీరు పూర్తిగా తగ్గిన తరువాత సఫారీ పార్క్‌ను తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

జూపార్క్‌లోకి భారీగా చేరిన వరదపై మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ స్పందించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులతో మంత్రి తలసాని ఫోన్‌లో మాట్లాడారు. నెహ్రూ పార్క్‌లో చేరిన వరదను తరలించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సిబ్బందిని పంపించి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.