ఏపీలోని విశాఖలో తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకు వచ్చి నిలిచిపోయిన ఓడను కొనుగోలు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి, రెస్టారెంట్‌గా మార్చేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం.
తీవ్ర వాయుగుండం కారణంగా అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్‌కు చెందిన వాణిజ్య నౌక ఎంవీహెచ్టీ 194 కార్గో విశాఖ తీరానికి కొట్టుకు వచ్చింది. తీరానికి దగ్గరలో రాళ్లు, ఇసుకలో కూరుకుపోవటంతో, ఓడను తిరిగి సముద్రంలోనిక తీసుకువెళ్లేందుకు వైజాగ్ పోర్టు ట్రస్టు ప్రయత్నాలు చేసింది. కార్గో నౌకను తిరిగి నీటిలోకి పంపేందుకు భారీ మెుత్తంలో ఖర్చు కానుండటంతో, ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి
కొట్టుకు వచ్చిన నౌకను ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, హోటల్‌గా మార్చాలని భావించింది. ఈ విషయంపై సచివాలయంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చర్చలు జరిపారు. ఓడ యజమానితో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
ఓడను కొనుగోలు చేసిన తరువాత పర్యటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపైన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఓడ క్వార్ట్జ్, ఫ్లై యాష్‌ను రవాణా చేస్తుంది. హోటల్‌గా మార్చేందుకు, అంతర్గత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 80 మీటర్ల పొడవైన ఈ నౌకలో గదుల తరహా కంపార్ట్మెంట్లు నిర్మాణానికి పెద్ద మెుత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి.
సంబంధిత కథనం: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ