ETV Bharat / city

గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్​.కె మీనా

ఏపీలోని విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశామని విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. విచారణలో భాగంగా మరికొందర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

visaka cp
గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్​.కె మీనా
author img

By

Published : Jul 7, 2020, 10:17 PM IST

గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్​.కె మీనా

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ ఆర్​.కె. మీనా తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేశామని వెల్లడించారు. ముగ్గురు ప్రభుత్వ అధికారులు సస్పెన్షన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. సంబంధించిన వ్యక్తులపై కఠిన శిక్షలు పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అన్నారు. విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్న సీపీ... హై పవర్ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. విచారణ ప్రక్రియలో భాగంగా మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ప్రమాద ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

అరెస్టైన వారి వివరాలు:

  1. జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ
  2. డీఎస్ కిమ్, టెక్నికల్ డైకెర్టర్
  3. పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)
  4. కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ
  5. రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్
  6. చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్
  7. కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్
  8. ముద్దు రాజేష్, ఆపరేటర్
  9. పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)
  10. శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ
  11. కె. చక్రపాణి, ఇంజినీర్
  12. కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్

ఇదీ చదవండి:

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.