విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖ రాసి శ్రీనివాసరావు అనే ప్లాంట్ ఉద్యోగి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై.. విశాఖ పోలీసులు వివరణ ఇచ్చారు. శ్రీనివాసరావు ఉక్కు పరిశ్రమలో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు ఏసీపీ పెంటారావు చెప్పారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు విధులకు హాజరై.. ఆత్మహత్య చేసుకుంటానని ప్లాంట్ లాగ్‌బుక్‌లో రాశాడని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌లో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని.. బ్లాస్ట్ ఫర్నేస్‌లో పడి చనిపోవడం అసాధ్యమని ప్లాంట్ ఉన్నతాధికారులు తెలిపినట్లు ఏసీపీ వెల్లడించారు.
ఉద్యోగాల పేరుతో మోసం..
శ్రీనివాసరావు ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరి వద్ద రూ.50 లక్షలు వసూలు చేశాడని తెలిపారు. ఇవాళ ఉదయం ఉద్యోగాల ప్రకటన వస్తుందని నమ్మించాడన్నారు. మరో 16 మందిని అదే తరహాలో నమ్మించాడని తెలిపారు.
ఇదీ చదవండి: ఎస్సారెస్పీలో కొట్టుకొచ్చిన మృతదేహం