ETV Bharat / city

105వ ఏడాదిలోకి.. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్

author img

By

Published : Dec 21, 2020, 1:06 PM IST

విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 105వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 6 వేల 500 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలిపారు.

visakha-cooperative-bank-ltd-has-completed-104-years
105వ ఏడాదిలోకి.. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్

ఈ ఆర్ధిక సంవత్సరానికి 6 వేల 500 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఏపీలో విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 105వ మహా జనసభలో పాల్గొన్నారు. 1916లో ప్రారంభించిన బ్యాంక్ 104 సంవత్సరాలు పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు.

2019 - 20 నాటికి రూ.5901.54 కోట్ల వ్యాపారం లావాదేవీలు నిర్వహించిందని.. అలాగే 87 వేల 863 మంది సభ్యులతో రూ.241.19 కోట్ల షేరు ధనంతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అర్బన్ సహకార బ్యాంక్​గా అవతరించినట్లు చలసాని తెలిపారు. కొవిడ్​తో సంభవించిన ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జూన్ 2020 నాటికి తమ లక్షాలను అధిగమించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్​లో 13 జిల్లాలో 46 బ్రాంచీలు, హైదరాబాద్ నగరంలో 4 బ్రాంచీలు కలిగి మొత్తం 50 బ్రాంచీలు, 22 ఏటీఎంలతో బహుళ రాష్ట్రాల సహకార అర్బన్ బ్యాంక్​గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.