తిరుమల శ్రీవారిని వీఐపీ దర్శన సమయంలో ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసమేతంగా స్వామిసేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.
స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. అర్చకులు గవర్నర్కు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ రావడంపై.. తమిళిసై ఆనందం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ విషయంలో ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
స్వామివారి సేవలో హీరో సుమన్
సినీ హీరో సుమన్.. వైకుంఠనాథుడిని సేవలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నుంచి రక్షణ పొందాలని కోరారు. తన 43 ఏళ్ల సినీ ప్రస్థానంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మరిన్ని మంచి పాత్రలు చేసేలా ప్రయత్నం చేస్తానన్నారు.
- ఇదీ చదవండి : బాలికల అభ్యున్నతితోనే దేశ ప్రగతి: గవర్నర్ తమిళిసై