తిరుమల శ్రీవారిని(tirumala tirupati devasthanams) పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు, సినీ నటులు గోపీచంద్, ప్రభుదేవా, సినీ దర్శకుడు మారుతి, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాలు, పర్వదినాల వివరాలను తితిదే (ttd) ఇదివరకే విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా దీపావళి ఆస్థానం, నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనసేవ, పుష్పయాగం, కార్తీక దీపోత్సవం వంటి ఉత్యవాలను నిర్వహించనున్నారు. నవంబర్ నెల విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
- నవంబరు 4న దీపావళి ఆస్థానం
- నవంబరు 6న శ్రీ తిరుమలనంబి శాత్తుమొర
- నవంబరు 8న నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనసేవ, శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర
- నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ
- నవంబరు 11న పుష్పయాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర
- నవంబరు 16న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రతం సమాప్తి
- నవంబరు 18న కృత్తికా దీపోత్సవం
- నవంబరు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర
ఇదీ చూడండి: Yadadri Temple Reopening: 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ: సీఎం కేసీఆర్