ETV Bharat / city

కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినోద్​కుమార్​ లేఖ

author img

By

Published : Jan 17, 2021, 8:05 PM IST

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని లేఖలో కోరారు. పెండింగ్​లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల ప్రతిపాదనలకు మోక్షం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

vinod kumar letter to central education minister ramesh pokhriyal

కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి... పెండింగ్​లో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం కలిగించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో 35 కేంద్రీయ విద్యాలయాలు కొనసాగుతుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన లేఖలో వెల్లడించారు.

రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 1,218 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా... అందులో 959 రెగ్యులర్, 131 పోస్టులు కాంట్రాక్టని తెలిపారు. ఇంకా 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థులకు విద్యా బోధన సరిగ్గా సాగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వివరించారు.

ఇదీ చూడండి: 'కుటుంబ పాలన పోవాలి... భాజపా ప్రభుత్వం రావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.