ETV Bharat / city

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది: విజయశాంతి

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా చేతులెత్తేసినట్టు తేలిపోయిందని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి అన్నారు.

vijayashanthitweets on kcr governament
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: విజయశాంతి
author img

By

Published : Jul 18, 2020, 6:50 AM IST

కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... కరోనా బాధితులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు స్పష్టమవుతుందని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి విమర్శించారు. ప్రధానమైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్​ ఆసుపత్రుల్లోని పరిణామాలే... ఇందుకు సాక్ష్యమన్నారు.

గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వారిని భయభ్రాంతుల్ని చేశారని... ప్రభుత్వం ప్రజలకు ఇందుకు సమాధానం చెప్పాలన్నారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి మురికినీళ్ల పాలై నరకాన్ని తలపించిందని.. నిమ్స్‌లోనూ ఏమంత ఆశాజనక పరిస్థితులు లేవని విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు పొరుగుసేవల నర్సులు, వార్డ్ బాయ్స్, నాలుగో తరగతి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేసే పరిస్థితి కల్పించారని విమర్శించారు. ఈ సమ్మెను ఆపించడానికి... ప్రభుత్వం రోజుల తరబడి సమయం తీసుకుందని విజయశాంతి ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:'150కిపైగా దేశాలకు కరోనా ఔషధాలు అందిస్తున్నాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.