సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి భాజపాలో చేరారు. దిల్లీలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
1998 జనవరి 26న మొదట భాజపాలో చేరారని విజయశాంతి తెలిపారు. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు భాజపా అనుకూలంగా లేకపోవడం వల్లనే బయటికొచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించానన్నారు.
కేసీఆర్కు బుద్ధిచెప్పడానికి భాజపా వచ్చింది. అది దుబ్బాక ఉపఎన్నికతో నిరూపించుకుంది.జీహెచ్ఎంసీలోనూ సత్తాచాటింది. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్, ఆయన కుటుంబాన్ని గద్దే దించడం ఖాయం. ఆయన చేసిన అవినీతిని ప్రజల ముందు పెడతాం. పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించాం. అభివృద్ధికి బదులుగా అనినీతి జరుగుతోంది. అవినీతి నిర్మూలన ఒక్క భాజపాతోనే సాధ్యం. కాంగ్రెస్ కొట్లాడం లేదు. కేసీఆర్కు ప్రత్యామ్నాయం భాజపా ఒక్కటే. రాబోయే రోజుల్లో కేసీఆర్కు గడ్డుకాలమే.
- విజయశాంతి
తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని విజయశాంతి నిర్ణయించుకున్నారన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: మా ప్రియమైన సీతకు స్వాగతం: ఆర్ఆర్ఆర్