ఏపీలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసేందుకు ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. దీనిని ఎవ్వరూ మార్చలేరని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు కర్నూలుకి తరలింపు విషయంలో సుప్రీంకోర్టు అనుమతి అవసరమని ఆయన అన్నారు. శాసన రాజధానిగా విజయవాడ ఉంటుందన్నారు.
తెలుగుదేశానికి రాజకీయ మనుగడ లేదని, చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇరవై రెండు సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏకపక్షంగానే ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.