భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 30న ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం సాగర్‌నగర్‌లోని అశోక్ నివాసానికి, సాయంత్రం 6 గంటలకు కిర్లంపూడిలోని నివాసానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 31న ఉదయం సాగర్‌నగర్‌లోని అశోక్ నివాసానికి చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉంటారు.
అనంతరం గాయత్రి విద్యా పరిషత్ సెంట్రల్ ఆడిటోరియంలో విశాఖ సాహితి సంస్థ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకయ్య(Vice President Venkaiah Naidu) పాల్గొననున్నారు. నవంబరు 1న సాయంత్రం ఐఐపీఏ సర్వసభ్య సమావేశంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. నవంబరు 2న ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు.