ETV Bharat / city

Venkaiah Naidu: ఏటికేడు హెల్త్ రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది: ఉపరాష్ట్రపతి - 15th global health summit news

Venkaiah Naidu at Global Health Summit: ఆరోగ్య సూచీలో తెలంగాణ 3వ స్థానంలో నిలవడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ పురోగతి సాధిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 15 వ గ్లోబల్​ హెల్త్​ సమ్మిట్​లో వర్చువల్​గా పాల్గొన్న ఉపరాష్ట్రపతి.. కీలకోపన్యాసం చేశారు.

Venkaiah Naidu: ఏటికేడు హెల్త్ రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది: ఉపరాష్ట్రపతి

author img

By

Published : Jan 5, 2022, 12:31 PM IST

Updated : Jan 5, 2022, 8:30 PM IST

Venkaiah Naidu: ఏటికేడు హెల్త్ రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది: ఉపరాష్ట్రపతి

Venkaiah Naidu at Global Health Summit: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విదేశాల నుంచి భారత్​లోని అనేక నగరాలకు వైద్యం కోసం రోగులు వస్తుండగా.. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మాత్రం సరైన వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ గ్లోబల్‌ హెల్త్ కేర్‌ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. టెలీ మెడిసిన్‌ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చన్న వెంకయ్య.. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌, ఆన్‌లైన్‌ మెడిసిన్‌ డెలివరీ సేవలు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఏపీఐ ప్రెసిడెంట్ అనుపమ గొట్టిముక్కల, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ రవి కొల్లి, ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయనున్నట్టు ఉపరాష్ట్రపతి తెలిపారు. రాష్ట్రం హెల్త్ కేర్ ఇండెక్స్​లో మూడో స్థానంలో నిలవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏటికేడు తెలంగాణలో వైద్య సదుపాయాలు మెరుగవుతున్నాయన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందించారు.

'మన సమాజాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్ టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి. ఫార్మాసూటికల్స్‌లో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. భారత్‌లో రోజురోజుకూ మెడికల్ టూరిజం పెరుగుతోంది. రూరల్​ హెల్త్​కేర్​ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. టెలీ మెడిసిన్‌ ద్వారా గ్రామాల్లో మరింత మెరుగైన సేవలు అందించవచ్చు. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌, ఆన్‌లైన్‌ మెడిసిన్‌ డెలివరీ సేవలు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి. ఏటికేడు ఆరోగ్య రంగంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రం హెల్త్‌ కేర్‌ ఇండెక్స్‌లో మూడో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది.'

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండి: వైద్యులపై కరోనా పంజా.. బిహార్​లో మరో 59మందికి పాజిటివ్​

Last Updated : Jan 5, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.