ETV Bharat / city

Venkaiah Naidu : 'దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో.. సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యం' - ap news 2021

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు(Swarnabharat Trust) 20వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు ఇంతింతై... వటుడింతై.. అన్నట్లుగా ఎదిగిందన్నారు. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్‌ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఉపరాష్ట్రపతి చెప్పారు.

Venkaiah Naidu
Venkaiah Naidu
author img

By

Published : Nov 14, 2021, 2:24 PM IST

సేవే అసలైన మతం

ఏపీలోని నెల్లూరు జిల్లా (nellore district) వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవం(20th anniversary of Swarnabharat Trust )లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. తెలుగు భాష రక్షణ కోసం స్వర్ణభారత్ ట్రస్టు ప్రయత్నిస్తోందన్నారు. మాతృభాష, మాతృభూమిని ఎప్పటికీ మరచిపోవద్దని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్య.. సేవే అసలైన మతమని తాను ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు.

"సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాను. సొంత ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతాను. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో... సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యం వస్తుంది. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాను."

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

యువతకు ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారు..

అన్నదాతలపై ఎక్కువగా దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) సూచించారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్నారు. యువతకు తగినంత పోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వెంకయ్యనాయుడు( Venkaiah Naidu) అభిప్రాయపడ్డారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గ్రామీణ మహిళలకు ఒకేషనల్‌ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చామని, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామని ఉపరాష్ట్రపతి తెలిపారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) చాలా కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(union minister amit shah) కొనియాడారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారన్నారు. "370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోవద్దనే ఒక మాట ఉంది. వెంకయ్య(venkaiah naidu) మాతృభూమిని ఎప్పుడూ మర్చిపోలేదు. స్వర్ణభారత్‌ ట్రస్టు(Swarna bharat trust).. వెంకయ్యనాయుడి గొప్ప ఆలోచన. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన పరితపిస్తుంటారు." అని షా అన్నారు.

ఇదీ చదవండి : AMIT SHAH : అనేక పదవులకు వెంకయ్యనాయుడు వన్నె తెచ్చారు: అమిత్‌షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.