క్రమశిక్షణ, నిబద్ధత లేని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. క్రమశిక్షణతో మెలగడం కష్టమని భావించి..కొందరు కులం, మతం, డబ్బుతో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారని చెప్పారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధునాతన వైద్య పరికరాలను ఆవిష్కరించటంతో పాటు ప్రాణవాయువు సాంద్రత జనరేటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఎవరి వృత్తికి వారే నాయకుడని..యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని వెంకయ్య సూచించారు. ప్రజావేదికలో మాతృభాషలో మాట్లాడటం పెంపొందించుకోవాలన్నారు.
"డా. పిన్నమనేని వైద్య కళాశాల సేవలు అభినందనీయం. నైపుణ్యాలను పెంచుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నా. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రజావేదికలో మాతృభాషలో మాట్లాడటం పెంపొందించుకోవాలి. నాకు మాతృభాష అంటే మక్కువ. రాష్ట్ర, దేశ రాజకీయాల్లోకి వెళ్లాకే మాతృభాషపై అభిమానం పెరిగింది. ఎవరి వృత్తికి వారే నాయకుడు. క్రమశిక్షణ, నిబద్ధత లేని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడు. క్రమశిక్షణతో మెలగడం కష్టమని నాయకులు కొత్త విధానం ప్రవేశపెట్టారు. కులం, మతం, డబ్బుతో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారు. కొవిడ్ పరిస్థితిలోనూ దేశంలో వైద్య రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది."- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి: 'మోదీ సభలో ఉగ్రదాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష