ETV Bharat / city

దోపిడీలకు నిలయాలుగా.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వాహన తనిఖీలు! - జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం తాజా సమాచారం

Commercial Tax News: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వాహనతనిఖీలు దోపిడీలకు నిలయాలుగా మారాయి. అక్రమ వ్యాపారుల భరతం పట్టేందుకు చేపట్టే ఆ తనిఖీలు కొందరు అధికారుల పాలిట వరంగా మారుతున్నాయి. అందినకాడికి దండుకుంటూ అక్రమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. సరకుల రవాణాలో అడ్డదారులు తొక్కే వారికి బంగారు బాతుగుడ్డులా మారాయి. ఈ క్రమంలోనే ఓ అధికారికి తనిఖీ విధులు అప్పగించొద్దని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి.

Department of Commercial Taxes
Department of Commercial Taxes
author img

By

Published : Jun 13, 2022, 9:43 PM IST

దోపిడీలకు నిలయాలుగా.. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వాహన తనిఖీలు

Commercial Tax News: దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక... రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీల కేంద్రాలను పూర్తిగా ఎత్తేశారు. తద్వారా సరుకులు రవాణా చేసే వాహనాలు గంటలపాటు తనిఖీల కోసం ఆగే అవసరం లేకపోగా వ్యాపారసంస్థల్లో సోదాలకు అడ్డుకట్ట పడింది. కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడటంతో.. వాటిని నిలువరించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌... 2018 నవంబర్‌లో 'వే బిల్లు' విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 50 వేలు మించి విలువైన ఏ సరుకునైనా రవాణా చేయాలంటే "వే బిల్లు" తప్పనిసరి చేసిన సర్కార్‌... ఒకే బిల్లుపై ఎక్కువసార్లు సరకు రవాణాచేసి.. అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది. "వే బిల్లు" తీసుకునే సమయంలోనే... దూరాన్ని బట్టి అందులోనే సమయాన్ని నిర్దేశిస్తారు. వాహనం వెళ్లాల్సిన సమయాన్ని మించి సరైన కారణం లేకుండా సరుకు రవాణా కాకుంటే.. అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణకు వచ్చి అపరాధ రుసుం విధిస్తుంటారు.

"వే బిల్లులు" లేకుండా సరుకు రవాణాచేయడం, వాస్తవ విలువ కంటే తక్కువగా చూపడం, వాస్తవ బరువుకంటే తక్కువచూపడం, ఒకచోటకు వెళ్లాల్సిన సరుకు మరొక చోటకు తరలించడం వంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని నిలువరించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా తనిఖీలను చేపడుతున్నారు. ప్రతిడివిజన్‌కు 2 ప్రత్యేక బృందాలు, రాష్ట్ర సరిహద్దు జిల్లాలు, ఎక్కువ రవాణా వాహనాలు... గోదాములు ఉన్న డివిజన్ల పరిధిలో 4 నుంచి 8 బృందాలు ఏర్పాటుచేశారు. అనుమానం ఉన్న వాహనాలకు చెందిన "వే బిల్లులు" పరిశీలించి అందులోని సరుకును తనిఖీ చేసి విలువను అంచనా వేయడం వంటివి చేస్తున్నారు. ఏ తేడా ఉన్న సరుకు విలువకు రెండింతలు అపరాధ రుసుం విధించటం... చెల్లించకపోతే సరకు రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం తనిఖీ బృందాలకు ఉంటుంది.

ఆ వాహనతనిఖీలు... రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లోని కొందరికి బంగారు బాతుగుడ్డులా మారాయి. అక్రమాల్ని గుర్తించిన వెంటనే బేరసారాలు ఆడటం... అందినకాడికి వసూళ్లు చేసుకుని వదిలేస్తున్నారు. తద్వారా లక్ష్యం పక్కదారి పట్టడమే కాకుండా ప్రభుత్వం భారీగా నష్టపోతోంది. హైదరాబాద్‌లో గుజరాత్‌ గల్లీ, ఉస్మాన్‌ గంజ్‌, ఇమ్లీబన్‌, చార్మినార్‌, గోషామహల్‌, బేగంబజార్‌, కొంపల్లి, దివాన్‌దేవుడి, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సరుకు గోదాములు ఉన్నాయి. అక్కడకి వివిధ రాష్ట్రాల నుంచి వందలాది లారీల ద్వారా పలురకాల సరకు రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఐరెన్‌ స్క్రాప్‌, రెడీమేడ్‌ దుస్తులు, చక్కెర, క్లాత్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కంప్యూటర్‌ ర్యామ్‌లు, మెడిసిన్‌ తదితర వాటికి "వే బిల్లులు" లేకుండానే రవాణా అవుతున్నట్లు తనిఖీల్లో వెలుగుచూశాయి. "వే-బిల్లులు" ఉన్నా... తక్కువ విలువ చూపడంకానీ, తక్కువ బరువు చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.

తనిఖీలు ముమ్మరంగా చేస్తే అక్రమార్కులకు అడ్డుకట్ట వేయొచ్చని భావించిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు... రాష్ట్రంలోని 12 వాణిజ్య డివిజన్లలోనూ ప్రహాసనంగా చేపట్టారు. ఒక లారీని ఒక బృందం తనిఖీచేస్తే.. మరొక బృందం తనిఖీ చేయరాదని పేర్కొన్నారు. అధికారుల సమన్వయలోపంతో దారి వెంబడి అన్నిబృందాలు వాహనాలను ఆపుతుండటంతో సరకు రవాణాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. "వే-బిల్లులు"తో పాటు సరకు విలువ, బరువు ఖచ్చితంగా ఉన్నా అధికారుల బేరసారాలతో... వ్యాపారులు ఎంతోకొంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అక్రమ వ్యాపారం చేసే వారిలో కొందరు తమ లారీలకు ఎస్కార్ట్‌గా వెళ్లడం.. అడ్డుతగిలిన అధికారులపై దాడులు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల తీరు... ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో తీవ్ర హెచ్చరికలు చేసినా నియంత్రణలోకి రావటం లేదు. ఓ అధికారి పెట్రేగిపోయి అధికారులకు సైతం కొరకరాని కొయ్యిలా మారడంతో... ఏం చేయాలో దిక్కుతోచక ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. చివరకు ఆ అధికారికి తనిఖీ విధులు అప్పగించొద్దని సంబంధిత జాయింట్‌ కమిషనర్‌కు వాణిజ్య పన్నుల కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడటం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.