Video Viral : వెంటపడ్డ ఆకతాయిని చితక్కొట్టిన అమ్మాయి - Girl Beat a Man for Harassing her in AP
Girl Beat a Man for Harassing : ఏపీలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.. అవతలి వారిని ఎదిరించే ధైర్యం, ఓపిక లేఖ ఎంతోమంది అభాగ్యులు బలవుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొద్దిమంది మాత్రం ఎదుటివారిని ఎదిరించి ధైర్యంగా పోరాడుతున్నారు. తాజాగా ఒక యువతి రాత్రిపూట ఇంటికి వెళుతుండగా ఓ యువకుడు అడ్డగించి వేధించాడు. ఆమె భయపడకుండా.. దుండగుడిని కర్రతో చితక్కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Video Viral
Girl Beat a Man for Harassing : ఏపీలోని కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి.. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఇంతలో ఓ దుండగుడు ఆమె వాహనాన్ని ఆపి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆమె అధైర్యపడకుండా ఎదురు తిరిగింది. దుండగుడిని కర్రతో చితక్కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించారు. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అని కొనియాడారు.
వెంటపడ్డ ఆకతాయిని చితక్కొట్టిన అమ్మాయి
ఇవీ చదవండి :