Vangaveeti Ranga Vardhanthi: వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతిని ఏపీలోని విజయవాడలో నిర్వహించారు. వంగవీటి రాధా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పోతిన మహేశ్ బందర్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వంగవీటి రాధా ఇంటి వద్దకు భారీగా రంగా అభిమానులు చేరుకోవడంతో... వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ వంగవీటి రాధ కృతజ్ఞతలు తెలిపారు. గత 33 ఏళ్లుగా నాన్న వర్ధంతిని అభిమానులు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం పనిచేస్తామని వంగవీటి రాధా స్పష్టం చేశారు.
ఆయన బిడ్డలమని చెప్పడానికి గర్వపడుతున్నా ...
వంగవీటి రంగా బిడ్డలమని చెప్పడానికి తను గర్వపడుతున్నానని ఎమ్మెల్యే వంశీ అన్నారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు ముగ్గురు.. ఎన్టీ రామారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా అని తెలిపారు. ప్రజలకు వంగవీటి రంగా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని జనసేన ప్రతినిధి పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు.
వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ..
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా.. వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇదీ చదవండి: Mother and daughter died in mulugu : కుమార్తె మరణ వార్త విని తల్లి గుండె ఆగింది!