గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సిన్ తీసుకోడానికి పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. వ్యాక్సినేషన్‌కు ముందస్తుగా చేసుకునే రిజిస్టేషన్ కోసం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారు స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలంగాణ పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకట రామిరెడ్డి తెలిపారు.
తపాల సిబ్బంది తమ వద్ద ఉన్న బ్రాంచ్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్ మెబైల్ ద్వారా కొవిన్ అప్లికేషన్లో వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని... ఉచితంగా సేవలు వినియోగించుకోచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 36 ప్రధాన తపాలా కార్యలయాలు, 643 ఉపతపాల కార్యాలయాలు, హైదరాబాద్‌లోని 10 బ్రాంచ్ కార్యాలయల్లో ఈ సేవలు అమలులో ఉన్నట్లు తెలిపారు.