ETV Bharat / city

Vaccination In Telangana: 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్​​.. తొలిరోజు 24,240 మందికి టీకా..

Vaccination In Telangana: రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్యవారి వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తొలిరోజు దాదాపు 24 వేల మందికిపైగా మొదటి డోస్‌ తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. వారం క్రితం వరకు 200 దాటని రోజువారీ కరోనా కేసులు... ప్రస్తుతం నిత్యం 300కు పైగా చేరుకున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 482 మందికి వైరస్‌ బారినపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సీరో సర్వే చేయనున్నారు. రక్తంలో యాంటీబాడీల అభివృద్ధిపై అధ్యయనం కోసం కార్యక్రమం చేపడుతున్నారు.

Vaccination In Telangana for 15 to 18 years students

author img

By

Published : Jan 4, 2022, 4:29 AM IST

Vaccination In Telangana: రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి ప్రభుత్వం కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభించగా... తొలిరోజే మంచి స్పందన వచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్యవారు రాష్ట్రంలో 18 లక్షల 41 మంది ఉండగా.... అందులో తొలి రోజు 24 వేల 240 మంది టీకా తీసుకున్నట్టు స్పష్టంచేసింది. మరో నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 2 వేల408 మంది టీకా తీసుకోగా... ఆ తర్వాత స్థానంలో 2 వేల 294 మందితో భద్రాద్రి జిల్లా ఉంది. సిరిసిల్ల జిల్లాలో అతిస్వల్పంగా కేవలం 36 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్‌లో 1,895 మంది వ్యాక్సిన్‌ వేసుకోగా... రంగారెడ్డి జిల్లాలో 1,825 మంది టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పట్ల ఎలాంటి అపోహలు అవసరంలేదని... 15నుంచి 18 ఏళ్లవారికి తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు టీకా ఇప్పించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి కొవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వైద్యశాఖ.... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి సీరో సర్వే నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఎన్​ఐఎన్​ సర్వే చేపట్టనుంది. ఇందుకోసం 16 వేల మంది నమూనాలను సేకరించి... వారి శరీరంలో యాంటీబాడీలను విశ్లేషించనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో జిల్లాల్లో 10 గ్రామాలను ఎంపిక చేసి.. ఒక్కో గ్రామంలో 40 మంది చొప్పున శాంపిళ్లను సేకరించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం మొత్తం 20 బృందాలు పని చేస్తాయని ఎన్​ఐఎన్​ డైరెక్టర్ హేమలత తెలిపారు. వైరస్‌ను ఎదుర్కొనేలా జనంలో ఎంతమేరకు నిరోధకత పెరిగిందనే అంశం ఈ సర్వే తెలుస్తుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.