అసెంబ్లీ సమావేశాలు అర్ధాంతరంగా ముగించడమేంటని మాజీ ఎంపీ వి. హనుమంతరావు మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని... ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని వీహెచ్ ఆరోపించారు. కేవలం కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు పెట్టారని ఆక్షేపించారు.
రెవెన్యూ చట్టం ఆమోదం పొందగానే సమావేశాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. సంఖ్యాపరంగా మాట్లాడే అవకాశం ఇవ్వడం సరైంది కాదని హనుమంతరావు అభిప్రాయపడ్డారు.