కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఏ మంత్రిగాని.. ముఖ్యమంత్రి గాని.. స్పందించకున్నా.. ఈటల సత్వరమే స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఈటలపై ఆరోపణలు వచ్చిన వెంటనే.. విచారణకు ఆదేశించారని.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో విచారణ చేయడమేంటని ప్రశ్నించారు.
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఈటల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల భూకబ్జా ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్లో కిరాయి అడగొద్దన్న సీఎం.. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని ఎందుకు అరికట్టలేకపోతున్నారని వీహెచ్ నిలదీశారు.
- ఇదీ చదవండి వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్