సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు(v hanumantha rao comments) డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మొదటిసారి తెరాస నాయకులు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేయబోతున్నారని వీహెచ్ తెలిపారు. నాడు వీళ్లే ధర్నాచౌక్ ఎత్తేసి.. ఇప్పుడు అదే స్థలంలో ధర్నాకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌లో వచ్చిన మార్పును వెనక్కి పోనివ్వదని వీహెచ్ హితవు పలికారు. కేంద్రం ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ నాయకులు ధర్నా చేస్తున్నారన్న వీహెచ్... ఈ చిత్తశుద్ధి రైతుల పట్ల ఉందా లేదా అని ప్రశ్నించారు. ధర్నా తర్వాత దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన తర్వాత మళ్లీ మరవద్దన్నారు. హుజూరాబాద్‌లో ఓడిపోయినప్పటికీ దళితబంధు అందరికి ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
నిజమైన కాంగ్రెస్ వారసునిగా..
"మా ప్రభుత్వం ఉన్న మూడు రాష్ట్రాల్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీల్లో తీర్మానం చేశాం. కేసీఆర్‌కు దమ్ముంటే.. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కేంద్రంపై నిరసనగా.. ధర్నాచౌక్‌లో తెరాస నేతలు ఆందోళనకు దిగుతున్నారు. మరీ.. ఇంతకు ముందు ఈ ప్రభుత్వమే ధర్నా చౌక్ అవసరం లేదు.. దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఇప్పుడు వాళ్లే ధర్నా చేస్తామంటున్నారు. ప్రభుత్వమే ధర్నా చేయటమనే కొత్త సంస్కారం తీసుకొస్తున్నారు. ఇకనైనా.. ప్రగతి భవన్ తలుపులు తీసి.. ప్రజల సమస్యలను కేసీఆర్ తెలుసుకోవాలి. హుజురాబాద్ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు రావటంపై ఇప్పటికే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన. దానిపై సమీక్షిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక ప్రధానంగా.. ఈటలకు తెరాసకు మధ్య జరిగిన పోటీనే. దానికి భాజపా వాళ్లు మాదే విజయమని పొంగిపోతున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలపరచాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి.. సోనియాగాంధీకి బహుమానంగా ఇచ్చి నిజమైన కాంగ్రెస్ వారసునిగా మిగలాలనేదే నా కోరిక." - వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: