హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి నుంచి కొత్త రైల్ మార్గం వేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభలో డిమాండ్ చేశారు. పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ పైన జరిగిన చర్చలో ఉత్తమ్ మాట్లాడారు.
రైల్వే లైన్ కోసం జాతీయ రహదారి వెంట భూమి కూడా ఉందని వివరించారు. ఆంద్రప్రదేశ్ విభజన బిల్లులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చారని... ఆరేళ్లు అవుతున్నా ఎందుకు ఏర్పాటు చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు.
కేంద్రం కొత్తగా ఏర్పాటు చేయనున్న దిల్లీ, బొంబాయి, కలకత్తా, చెన్నై నగరాలను కలిపే క్వడ్రిలేటరల్ రైల్వే ప్రాజెక్టులో హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. జగ్గయ్యపేట నుంచి మిర్యాలగూడ వరకు గూడ్స్ రైల్ నడుస్తుందని దానిని ప్యాసింజర్ రైలుగా మార్చాలని... అలాగే మేళ్లచెరువు, మిర్యాలగూడకు షటిల్ రైల్ నడపాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:పీసీసీ కొత్త సారథి కోసం కాంగ్రెస్ కసరత్తు