ETV Bharat / city

మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కలిసిన ఉప్పుగల్లు గీత కార్మికులు - తెలంగాణ తాజా వార్తలు

జనగామ జిల్లా జాఫర్​ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు ​మంత్రి శ్రీనివాస్ గౌడ్​ని కలిశారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ నిర్మాణం వల్ల 1,500పైగా తాటి, ఈత చెట్లు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు.

uppagallu-village-gouds-met-minister-srinivas-goud-in-hyderabad
మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కలిసిన గీత కార్మికులు
author img

By

Published : Mar 20, 2021, 2:07 PM IST

ఉప్పుగల్లు రిజర్వాయర్ నిర్మాణం వల్ల 1,500 పైగా తాటి, ఈత చెట్లు ముంపునకు గురవుతున్నాయని గీత కార్మికులు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. తమ జీవనోపాధికి నష్టం కలుగుతుందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా జాఫర్​ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు ​మంత్రిని కలిశారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వెంటనే స్పందించిన మంత్రి... జనగామ కలెక్టర్​తో మాట్లాడారు. బాధిత గీత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని వెంటనే 10 ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించారు. ముంపునకు గురవుతున్న తాటి, ఈత వనంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆబ్కారీ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: గూగుల్ 'వసంత రుతువు డూడుల్' సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.