Kishan Reddy in Mahankali Festival: దిల్లీ తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. వచ్చే ఏడాది నుంచి బోనాల పండుగ మరింత ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దిల్లీలో జరిగే ఉత్సవాలకు పర్యాటకశాఖ తరఫున నిధులిస్తామని తెలిపారు.
'వచ్చే ఏడాది నుంచి దిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు. దిల్లీలో జరిగే ఉత్సవాలకు పర్యాటకశాఖ తరఫున నిధులిస్తాం. దిల్లీలో మరింత వైభవంగా బోనాల ఉత్సవాలు. లాల్‌దర్వాజ కమిటీ ఇతర ఆలయాలను కలుపుకొని ఉత్సవాలు జరపాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఘనంగా బోనాల ఉత్సవాలు.'- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
దిల్లీలో ఏడేళ్లుగా మహంకాళి ఆలయ కమిటీ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల కోసం రాష్ట్రం నుంచి 300 మంది భక్తులు, కళాకారులు దిల్లీ వెళ్లారు. ఉత్సవాల్లో భాగంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు డోలు దరువులు, అమ్మవారి వేశధారణాలు, పులి వేశాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చదవండి: