ETV Bharat / city

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భాజపాదే గెలుపంటున్న కిషన్​రెడ్డి - union minister Kishan reddy comments

Kishan Reddy Comments on KCR సీఎం కేసీఆర్​తో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీపై ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

union minister Kishan reddy fire on CM KCR and his family

author img

By

Published : Aug 16, 2022, 7:27 PM IST

Kishan Reddy Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఆయన కుటుంబసభ్యులు ప్రధాని మోదీపై ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము తెరాసపై యుద్ధం చేయడం లేదని ప్రజల తరుఫున పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా గెలుపు ఖాయమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. తెరాస సర్కార్‌ గవర్నర్‌ పట్ల కనీస ప్రోటోకాల్‌ పాటించడం లేదని విమర్శించారు.

"తెలంగాణలో 8 ఏళ్లుగా కుటుంబ రాజ్యం నడుస్తోంది. 8 ఏళ్లుగా అవినీతిలో కూరుకుపోయిన తెరాస శాసనసభ్యులు నియతృత్వ పాలన చేస్తున్నారు. 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నారు. ప్రజలను కూడా కలవరు. నెలలో 15 రోజులు ఫామ్‌హౌస్‌లో ఉంటారు. ఇలాంటి ముఖ్యమంత్రి వద్దని ప్రజలు భావిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని భాజపాకు మద్దతివ్వాలనుకుంటున్నారు. ఇందుకోసమే రాత్రికి రాత్రికి మాటమార్చిన కేసీఆర్‌ కుటుంబసభ్యులు భాజపా, మోదీకి వ్యతిరేకంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు." - కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భాజపాదే గెలుపంటున్న కిషన్​రెడ్డి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.