తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కంటే రాజకీయమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో అనుకున్న సిద్ధాంతం కోసం పనిచేయాలని నక్సలైట్లకు కిషన్ రెడ్డి సూచించారు. హింస, తుపాకుల ద్వారా ఏం సాధించలేరని హితవు పలికారు. హింస ద్వారా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. హింసను విడనాడాలని కోరారు.
- ఇదీ చదవండి : ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకరించిన పురిటి గడ్డ