Kishan Reddy About Ayushman Bharat : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ప్రజల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ప్రొఫైల్‌ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ కార్డు పేద ప్రజలందరికీ అందేలా వైద్యాధికారులు చొరవ చూపాలని సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మేళాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్రమంత్రి కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి :
Ayushman Bharat Health Cards : హైదరాబాద్ నారాయణగూడ కేశవ స్మారక పాఠశాలలో ఆరోగ్య మేళాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరోగ్య మేళాకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లను కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రతి ఒక్కరు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
"భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తోంది. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు వినియోగించుకోకుండా ప్రైవేట్ హాస్పిటళ్ల బాట పడుతున్నారు. వారికి నాణ్యమైన సర్కార్ వైద్యం అందించేలా.. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా ఈ మేళాలను కేంద్రం సర్కార్ ఏర్పాటు చేసింది. పేద, ధనిక అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది."
- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక మంత్రి
ఇవీ చదవండి :