ETV Bharat / city

'కేసీఆర్‌ గురించి పీఎంవో అలాంటి సందేశం పంపలేదు' - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్

Union Minister Jitendra Singh : మోదీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఖండించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని చెబుతూ ట్వీట్ చేశారు.

Union Minister Jitendra Singh
Union Minister Jitendra Singh
author img

By

Published : Apr 29, 2022, 10:20 AM IST

Union Minister Jitendra Singh : ‘ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనకుండా చూడాలంటూ’ ప్రధానమంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని పీఎంవో మంత్రి జితేంద్రసింగ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు.

  • According to some media reports, the son of Telangana CM has claimed that PMO sent a message that Shri KCR should not be a part of PM’s programs when he visited Hyderabad.
    This is patently untrue. No such message was sent by the PMO. 1/2

    — Dr Jitendra Singh (@DrJitendraSingh) April 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Union Minister Jitendra Singh Tweet : ‘‘మోదీ హైదరాబాద్‌ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనకుండా చూడాలని ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్లు తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది పూర్తిగా అబద్ధం. పీఎంవో అలాంటి సందేశం ఏదీ పంపలేదు. వాస్తవానికి ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు, ఆయన కార్యక్రమాల్లో కేసీఆర్‌ పాల్గొంటారని ఆశించాం. ఆరోగ్యం బాగాలేనందున ఆయన హాజరుకాలేకపోతున్నట్లు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించింది’’ అని జితేంద్రసింగ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • Infact, the CM of Telangana was expected at the events on 5th February when PM visited Hyderabad. It was the CM’s office which informed the PMO that the CM was not feeling well and hence would not be attending. 2/2

ఇదే విషయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా స్పందించారు. అనారోగ్యం వల్ల ప్రధాని కార్యక్రమానికి వెళ్లడంలేదని సీఎం కేసీఆర్‌ అప్పట్లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌ ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు భిన్నంగా మాట్లాడారని, మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.