నేడు రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటించనున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశానుసారం మధ్యాహ్నం 12 గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బడ్జెట్‌పై మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మారియట్ హోటల్‌లో భాజపా రాష్ట్ర శాఖ, లఘు ఉద్యోగ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించే మేధావులు, పారిశ్రామిక వేత్తలతో పరస్పర చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. మేధావులు, పారిశ్రామిక వేత్తల సందేహాలను నివృత్తి చేయనున్నారు.
ఇదీ చదవండి: ఈనెల 10న నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన