ETV Bharat / city

'తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐలంటే భయమెందుకు..'

Jyotiradhitya Cynthia Comments: భాజపా పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా... కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ కోర్‌ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌ జిల్లా పదాధికారులో సమావేశమై.. కేంద్ర సంక్షేమ పథకాల అమలుతీరు, పార్టీ బలోపేతంపై చర్చించారు.

Union Civil Aviation Minister Jyotiradhitya Cynthia comments on telangana government

author img

By

Published : Jul 29, 2022, 5:25 PM IST

Jyotiradhitya Cynthia Comments: రాష్ట్ర ప్రభుత్వం తిరోగమనంలో ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. భాజపా పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా... సింథియా హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ కోర్‌ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌ జిల్లా పదాధికారులో సమావేశమై.. కేంద్ర సంక్షేమ పథకాల అమలుతీరు, పార్టీ బలోపేతంపై చర్చించారు. రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తల కృషితో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐలంటే భయమెందుకని ప్రశ్నించిన సింధియా తప్పు చేస్తేనే భయపడతారని ఎద్దేవాచేశారు.

"క్షేత్ర స్థాయిలో కార్యకర్తల కృషి... జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... మేం అందరూ కలిసి తెలంగాణలో భాజపా అధికారంలోకి తీసుకురావడంలో సఫలం అవుతాం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో... తెలంగాణలో భాజపా పూర్తి స్థాయిలో ఫలితాలను సాధిస్తుంది. బూత్‌ స్థాయిలో బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. మా దృష్టంతా ప్రతి బూత్‌లోనూ పార్టీని బలోపేతం చేయటమే." - జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి

గౌలిపురాలోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో సమావేశంలో పాల్గొననున్న సింథియా... ఆ తర్వాత భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకుంటారు. రేపు ఉదయం 7జిల్లాల మోర్చాల అధ్యక్షులతో సింధియా సమావేశం కానున్నారు. కార్వాన్‌లో మొదటి సారి ఓటు వేయనున్న యువతతో.. సింధియా సమావేశం అవుతారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.