Unemployment in Telangana : జనవరిలో దేశ నిరుద్యోగ రేటు భారీగా తగ్గి 6.57 శాతానికి పరిమితమైంది. 2021 మార్చి తరవాత ఇదే కనిష్ఠ స్థాయి. కొవిడ్ ఒమిక్రాన్ కేసుల తీవ్రత లేనందున, ఆంక్షలను సడలించడంతో దేశం నెమ్మదిగా పుంజుకుంటుండడం ఇందుకు నేపథ్యమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) వెల్లడిస్తోంది.
తెలంగాణలోనే తక్కువ
Unemployment in Telangana News : జనవరిలో నిరుద్యోగ రేటు పట్టణ భారతంలో 8.16 శాతం; గ్రామీణ ప్రాంతాల్లో 5.84 శాతంగా నమోదైందని తెలిపింది. డిసెంబరులో నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదు కాగా.. పట్టణాల్లో ఇది 9.3%; గ్రామాల్లో 7.28 శాతంగా ఉంది. సీఎమ్‌ఐఈ గణాంకాల ప్రకారం.. అత్యంత తక్కువ నిరుద్యోగ రేటును తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. జనవరిలో ఇక్కడ 0.7 శాతం మాత్రమే కనిపించింది.
మహిళలే ఎక్కువ..
Telangana Unemployment : ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్(1.2%), మేఘాలయ(1.5%), ఒడిశా(1.8%)లున్నాయి. హరియాణాలో మాత్రం అత్యంత ఎక్కువగా 23.4 శాతం; రాజస్థాన్‌లో 18.9 శాతం చొప్పున నిరుద్యోగ రేటు నమోదైంది. డిసెంబరు 2021 నాటికి దేశంలో 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నాయని సీఎమ్‌ఐఈ అంచనా వేసింది. ఇందులో ఎక్కువ భాగం మహిళలే. ఇందులో 3.5 కోట్ల మంది పని కోసం చురుగ్గా ఎదురుచూస్తుండగా.. మిగతా వారు పెద్దగా పట్టించుకోకపోయినా.. పని లభిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎమ్‌ఐఈ ఎండీ, సీఈఓ మహేశ్ వ్యాస్ విశ్లేషిస్తున్నారు.
- ఇదీ చదవండి : Telangana High Court On Kaloji University Appeal : 'రీవాల్యుయేషన్ చేశాకే పరీక్షలు నిర్వహించండి'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!