ఇదీ చదవండి:
Underground water tank: కడపలో బ్రిటిష్ కాలం నాటి భూగర్భ వాటర్ ట్యాంక్..! - కడపలో భూగర్భ వాటర్ ట్యాంక్
Uunderground water tank: కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ వాటర్ ట్యాంక్ వెలుగులోకి వచ్చింది. సీకే దిన్నె మండలం ఊటుకూరు సమీపంలో 1890లో బ్రిటీష్ వారు నిర్మించిన ఈ ట్యాంక్ వెలుగులోకి రావడంతో ప్రజలు పెద్దసంఖ్యలో దాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. 150 ఏళ్ల క్రితం కడపను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలించిన సందర్భంలో తాగునీటి సరఫరా కోసం.. ఊటుకూరు వద్ద పదిబోర్లు వేసి భూగర్భ ట్యాంకులో నీటిని నిల్వ చేసేవారు. అవసరమైనపుడు వాటిని గ్రావిటీ ద్వారా కడప కలెక్టరేట్‌కు తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి సిమెంటు, కాంక్రీటు వాడకుండా కేవలం సుద్ధ గచ్చుతో నిర్మించిన ట్యాంకు నేటికీ చెక్కుచెదరక పోవడం విశేషం. మరి ఆ వాటర్ ట్యాంక్ గురించి బ్రిటీష్ వారు నిర్మించిన మంచినీటి ట్యాంకు గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
Underground water tank:
ఇదీ చదవండి: