ETV Bharat / city

తిరుమల ఆలయంలో ఏకాంత పర్వదినం - తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇరవై మందికి మించకుండా కార్యక్రమాన్ని చేపడతామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆలయ శుద్ధి అనంతరం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.

ugadi-celebrations-in-tirumala-will-be-limited-says-temple-additional-eo
తిరుమల ఆలయంలో ఏకాంత పర్వదినం
author img

By

Published : Mar 25, 2020, 7:40 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నట్టు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం కోయిల్​ఆళ్వార్​ తిరుమంజనాన్ని అతితక్కువ మందితో పూర్తి చేశామని, ఎక్కడా పది మందికి మించకుండా పాల్గొన్నారని చెప్పారు. ఈసారి ఉగాది ఆస్థానంలో కేవలం 20 మంది కంటే తక్కువే పాల్గొంటారని వివరించారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ తర్వాత ఆలయ శుద్ధి చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.

మరో 21 రోజుల దర్శనాల రద్దు?

ప్రధాని నరేంద్ర మోదీ మరో 21 రోజుల పాటు లాక్​డౌన్​ ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకు దర్శనాలు రద్దు చేయాలని తితిదే యోచిస్తోంది. స్వామి వారి కైంకర్యాలు, సేవలను ఏకాంతంగా కొనసాగించనుంది.

ఉగాది వేడుకలకు భక్తులను అనుమతించొద్దు

ఉగాది వేడుకల నేపథ్యంలో ఏ ఆలయంలోకి కూడా భక్తులను అనుమతించొద్దని దేవాదాయశాఖ ఆదేశించింది. ఉగాది కారణంగా బుధవారం భక్తులు వివిధ ఆలయాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎవరికీ అనుమతివ్వొద్దని అధికారులు ఆదేశించారు.

ఇదీ చదవండి: తిరుమలలో వైభవంగా కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.