Women Safety with Uber APP : రాష్ట్రంలో మహిళా భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా.. మహిళా భద్రతా విభాగం మరో ముందడుగు వేసింది. ఆధునిక సాంకేతిక పద్ధతులను విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటున్నపోలీస్ శాఖ.... "ఉబర్" తో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కలసి పనిచేయనున్నాయి.
పోలీస్ శాఖ కొత్తగా.. ఉబర్ పాసింజర్ కారులో ప్రయాణిస్తున్న వారు.. తమకి ఏదైనా ఆపద లేదా ప్రమాదం జరిగితే కేవలం ఒక బటన్ నొక్కితే... వెంటనే సమీపంలోని ప్లీస్ పెట్రోల్ కార్... లేదా బ్లూ కోల్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తగు రక్షణ నిస్తాయని పోలీసు మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా తెలిపారు. ఉబర్ యాప్‌తో పోలీస్ శాఖ డయల్ 100 తో అనుసంధానించడం వల్ల.. ప్రమాదానికి గురైన మహిళల రియల్ టైమ్ లొకేషన్, యూజర్ వివరాలు పోలీసులకు... త్వరితగతిన అందుతాయని ఆమె పేర్కొన్నారు.