ఏపీలోని విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఇద్దరు లోకో పైలట్లు తీవ్ర శ్వాస ఇబ్బందులకు గురయ్యారు. సిగ్నల్ లేక తెల్లవారుజామున 2.30 గం.కు 45 నిమిషాలపాటు గూడ్స్ నిలిచిపోయింది. ఎక్కువ సేపు గాలి పీల్చడంతో ఇద్దరు లోకో పైలట్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత వారి పరిస్థితి మెరుగైంది.
ఎల్‌జీ గ్యాస్ ప్రభావంతో ఇప్పటివరకు ఐదుగురు లోకోపైలట్లు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం లోకోపైలట్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. విశాఖ పరిధిలో లోకోపైలట్ల విధులను తాత్కాలికంగా రైల్వేశాఖ నిలిపివేసింది.
ఇవీ చదవండి: కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్