Liquor Bottles: ఏపీలోని విజయవాడ కమిషనరేట్ పరిధిలో గత రెండేళ్లలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 62 వేల మద్యం సీసాలను నున్న మ్యాంగో మార్కెట్ యార్డులో పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వాటిలో విదేశీ మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయని కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు.
అక్రమ మద్యం రవాణాను కట్టడి చేస్తామని కాంతిరాణా టాటా తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని మైలవరం, విస్సన్నపేట తదితర మండలాల్లో నాటుపుసారాపై ప్రత్యేక నిఘా పెడతామని వెల్లడించారు.
ఇవీ చదవండి: 'కేసీఆర్ బొమ్మతో కాదు.. నా సొంత పని తీరుతోనే గెలుస్తూ వచ్చా..'
సోనియాను ఆరు గంటలు ప్రశ్నించిన ఈడీ.. మరోసారి రావాలంటూ సమన్లు..