ETV Bharat / city

తల్లి ప్రేమ కోల్పోయామని.. అన్నదమ్ముల బలవన్మరణం - బలవన్మరణం

తల్లి ప్రేమ కోల్పోయామని.. మనోవేదనతో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మేడ్చల్​-మల్కజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో బుధవారం జరిగింది. ఒకరు ఉరివేసుకోగా.. ఒకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Suicide
అన్నదమ్ముల బలవన్మరణం
author img

By

Published : Jun 23, 2022, 5:30 AM IST

మేడ్చల్‌ జిల్లా కీసరలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసర పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌ జిల్లాలోని రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి అన్నదమ్ములు. వారి తల్లి ప్రమీల 9 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన సోదరులు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు.

వారిలో యాదిరెడ్డి (34) ఉరేసుకోగా, తమ్ముడు మహిపాల్‌ రెడ్డి (29) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్‌ రాసి బలవర్మణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: దంపతుల ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ.5.5కోట్లు కుచ్చుటోపీ

Jubilee hills rape case: మైనర్ల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.