Budget reaction: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా నిరాశజనకంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పసుపు రైతు సంఘం అధ్యక్షుడు కోటిపాటి నరసింహనాయుడు తెలిపారు. రైతులు, సామాన్యులు, వేతన జీవుల ఆశలకు భిన్నంగా ఎలాంటి లాభంలేని బడ్జెట్‌గా అభివర్ణించారు. ఐటీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు అంటేనే ఎంత లాభసాటి బడ్జెటో అర్థమవుతుందని అంసతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆక్షేపించారు.
బడ్జెట్‌లో ఆ ఊసే లేదు..
"పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు ధర్నాలు, పోరాటాలు చేస్తున్న తరుణంలో.. బడ్జెట్‌లో అసలు దాని ఊసే లేదు. రాష్ట్రాలకు వడ్డీ లేని లక్ష కోట్ల రుణాలు ఇస్తామన్నారు. కానీ.. ఏ రాష్ట్రానికి ఇస్తారో చెప్పలేదు. అంటే ఆ రుణాలు కేవలం భాజపా పాలిత రాష్ట్రాలకే అని స్పష్టమవుతుంది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు పోతామనడాన్ని మేం ఖండిస్తున్నాం. మరోవైపు.. రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవటం బాధకరం. రైల్వే రంగంలో రాష్ట్రానికి కొత్త ప్రతిపాదనలు లేవు. మోదీ సర్కారు బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది." - కోటిపాటి నరసింహనాయుడు, తెలంగాణ రాష్ట్ర పసుపు రైతు సంఘం అధ్యక్షుడు
ఇదీ చూడండి:
- CM KCR comments on Budget: పసలేని బడ్జెట్.. గోల్‌మాల్ బడ్జెట్: సీఎం