తమిళులు పవిత్రంగా భావించే పురటాసి మాసంలో.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం(Tirumala vip break darshanam) కల్పిస్తామంటూ సోషల్ మీడియాలో వాణిజ్య ప్రకటన(commercial ads on Tirumala vip break darshanam) జారీచేసిన వాసవి యాత్ర, టూర్స్ సంస్థపై చర్యలు తీసుకోనున్నట్లు తితిదే(ttd) స్పష్టం చేసింది.
![ప్రైవేట్ సంస్థ రూపొందించిన బ్రోచర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13194573_pa.jpg)
చెన్నైకి చెందిన ఈ సంస్థ.. రూ.1,11,116కు చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి తిరుపతికి రానూపోనూ ప్రయాణ సౌకర్యం, ఫైవ్ స్టార్ హోటల్‌లో బసతో పాటు తిరుమల, తిరుచానూరులో బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు ప్రకటన ఇచ్చినట్లు తితిదే పేర్కొంది. తితిదే వీఐపీ బ్రేక్ టికెట్లను ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు, వారు సిఫార్సు చేసేవారికి మాత్రమే కేటాయిస్తుందని, ఇలాంటి ప్రకటనల(fake ads on Tirumala vip break darshanam)ను నమ్మవద్దని సూచించింది. భక్తులను మోసగిస్తున్న ఈ యాత్రా సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.