శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లను అందుబాటులో ఉంచింది. ఆగస్టు నెలకు సంబంధించిన ఈ టికెట్లను రోజుకు 5 వేల చొప్పున విడుదల చేశారు.
ఈ మేరకు తితిదే వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి తగ్గని కారణంగా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. టికెట్లు కోసం ఎక్కువ మంది భక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న 17,073 మంది భక్తులు
శ్రీవారిని సోమవారం 17,073 మంది భక్తులు దర్శించుకున్నారు. 8,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.70 కోట్లుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: THOLI EKADASHI: తొలి ఏకాదశి అంటే ఏమిటి? విష్ణుమూర్తి ప్రసన్నం కావాలంటే ఏం చేయాలి?