తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) సంబంధించిన సేవలు, సమస్త సమాచారం ఒకేచోట లభించేలా ప్రత్యేక యాప్(APP) తయారు చేసేందుకు జియో(JIO)తో తితిదే ఒప్పందం చేసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్(thirumala annamayya bhavan)లో జియో సంస్థ ప్రతినిధులతో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తితిదే ఐటి విభాగం అధికారులు సమావేశమయ్యారు.
శ్రీవారి దర్శన టిక్కెట్లు(visiting tickets) విడుదల సమయంలో తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు తితిదే అధికారులు జియో సహకారం తీసుకున్నారు. జియో సంస్థ అందించిన సహకారంతో శ్రీవారి దర్శన టిక్కెట్లను భక్తులకు అందించిన తితిదే... జియో నుంచి సాంకేతిక సహకారం పూర్తిస్థాయిలో అందించే అంశంపై చర్చించారు. అందుకు అంగీకరించిన జియో సంస్థ ప్రతినిధులు తితిదేకు సంబంధించిన సమస్త సమాచారాన్ని భక్తులకు అందించేలా ప్రత్యేక యాప్ రూపొందించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఐదేళ్లుగా ఉచితంగా తితిదేకు సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సంస్థ( TCS company) సమన్వయంతో జియో సంస్థ సేవలను వినియోగించుకోనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: CM KCR: అఖిలపక్షంగా దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...