తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం మరోసారి వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన కొందరు భక్తులు శ్రీవారి కల్యాణోత్సవ టికెట్ల కోసం దళారులను ఆశ్రయించారు. దళారులు నకిలీ టికెట్లను ఇచ్చారు. వాటితోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వచ్చారు.
అక్కడ టికెట్ స్కాన్ కాకపోవటంతో వ్యవహారం బయటపడింది. టికెట్‌ను రూ. 4,400 చొప్పున కొనుగోలు చేసినట్లు భక్తులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. ముఠాను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ టికెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీవారి భక్తులకు అధికారులు సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
ఇదీచూడండి: Amith Shah: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్‌షా