ETV Bharat / city

ఆంజనేయుడి జన్మస్థల నిర్ధారణ కోసం తితిదే కమిటీ - ఆంజనేయుడి జన్మస్థల నిర్ధారణకు తితిదే కమిటీ

ఆంజనేయ స్వామి జన్మస్థలంగా.. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని నిరూపించడానికి తితిదే సిద్ధమైంది. పండితులతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి.. నిర్ధారణ కోసం ఆధారాలను సేకరించాలని ఆలయ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు.

ttd
ఆంజనేయుడి జన్మస్థల నిర్ధారణ కోసం తితిదే కమిటీ
author img

By

Published : Dec 17, 2020, 9:02 AM IST

ఏపీలోని తిరుమ‌ల గిరుల్లోని ఆంజ‌నాద్రి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మక్షేత్ర‌మ‌ని నిరూపించడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు సేకరించడానికి ఆరుగురు పండితులతో తితిదే కమిటీ ఏర్పాటు చేసింది. జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉపకుల‌ప‌తి ముర‌ళీధ‌ర శ‌ర్మ, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉపకుల‌ప‌తి స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, ‌జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు జె.రామ‌క్రిష్ణ, శంక‌ర‌నారాయ‌ణ‌, ఎస్వీ వేద ఆధ్య‌య‌న సంస్థ ప్ర‌త్యేకాధికారి విభీష‌ణ శ‌ర్మ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈవో జవహర్ రెడ్డి తితిదే ప‌రిపాల‌న భ‌వ‌నంలోని తన కార్యాల‌యంలో కమిటీ సభ్యులతో స‌మావేశం నిర్వ‌హించారు.

అవసరమైన ప‌రిశోధనలు

దేవాల‌యాల స్థ‌ల పురాణాల‌ ఆధారంగా వేరువేరు ప్రాంతాల‌ను హ‌నుమంతుని జ‌న్మ ‌స్థ‌లంగా ప్ర‌చారం చేసుకొంటున్నాయని ఈ నేప‌థ్యంలో పౌరాణిక‌, చారిత్ర‌క‌, ఆచార‌ వ్య‌వ‌హార‌ దృష్టితో ఆంజ‌నేయ‌స్వామి తిరుమ‌ల‌లో జ‌న్మించార‌ని ఆధారాలతో నిరూపించటానికి అవసరమైన ప‌రిశోధనలు చేయాలని పండితులను కోరారు.

పురాణాల‌ ఆధారంగా తిరుమ‌ల ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మస్థ‌ల‌మ‌ని పండితులు ఈవో దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై స్పందించిన ఈవో.. ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌లం తిరుమ‌ల అని నిరూపించ‌డానికి త‌గిన స‌మాచారం సిద్ధం చేయ‌వల‌‌సిందిగా ఆయ‌న పం‌డితుల‌ను కోరారు.

ఇదీ చదవండి: అందివచ్చిన పని చేసుకుంటూ... ఆత్మగౌరవంగా జీవిస్తూ....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.