దసరా సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరిగే అవకాశాలున్నాయని తిరుమల దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అంచనా వేశారు. 9రోజులు ప్రొటోకాల్ ఉన్న వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయని చెప్పారు. సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. చంటిపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
తిరుమల కొండపై 7 వేల 200 వసతి గదులు ఏర్పాటు చేశామన్న ఈవో... వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ నియంత్రిస్తామని వివరించారు. 5 కేంద్రాల ద్వారా నిరంతరం అన్నప్రసాద పంపిణీ చేస్తామన్నారు. గరుడ సేవరోజు 3 లక్షల మందికి సరపడా అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వివరించారు. నిత్యం 7లక్షల లడ్టూలు నిల్వ ఉండేలా ప్రణాళికలు రూపొందించామని చెబుతున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో ఈటీవి భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండీ... భవిష్యత్తు చిట్‌ఫండ్ కంపెనీలదే: శైలజా కిరణ్