ETV Bharat / city

Tirumala Srivari Brahmotsavam: ఈ సారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించనున్నారో తెలుసా? - Srivari Brahmotsavam

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

lord venkateswara brahmotsavalu
lord venkateswara brahmotsavalu
author img

By

Published : Oct 6, 2021, 7:49 PM IST

రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) ప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavam) ప్రారంభమవుతాయని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 11న ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్​ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఛైర్మన్ వెల్లడించారు.

ఈనెల 12 నుంచి చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నెల రోజుల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బర్డ్‌ ఆసుపత్రిలో రూ.25 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధి. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు సీఎం జగన్‌ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఛానల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక సీఎం పాల్గొంటారుని సుబ్బారెడ్డి తెలిపారు.

'ఏపీలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తాం. రేపటి నుంచి 15 వరకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఉచిత రవాణా, దర్శన ఏర్పాట్లు చేశాం. భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధ్రువపత్రంతో రావాలి. కరోనా వల్ల ఏకాంతంగా బ్రహ్మోత్సవాల నిర్వహిస్తున్నాం. ఆలయ కల్యాణ మండపంలోనే వాహన సేవల నిర్వహణ. ఆగమోక్తంగా అన్ని వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఈనెల 15న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.'

-వై.వి.సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్​

ఇదీచూడండి: TIRUMALA BRAHMOTHSAVALU : సాయంత్రం నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.